నికోలస్ క్రజ్ పోలీసులు తో 'దెయ్యాలే నాతో ఆ పని చేయించాయి..'
- February 17, 2018
వాషింగ్టన్ : 'నా తలలో ఏవేవో అరుపులు వినిపించేవి. అవి దెయ్యాల అరుపులనుకుంటా. అవే నాకు కాల్పులు ఎలా జరపాలో చెప్పాయి' ఈ మాటలు ఫ్లోరిడా స్కూల్లో కాల్పులకు తెగబడిన ఉన్మాది పోలీసులకు చెప్పాడు. ఫ్లోరిడాలోని హైస్కూల్లో అదే స్కూల్లో గతంలో చదివిన నికోలస్ క్రజ్ అనే యువకుడు ఉన్మాదిగా మారి కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు స్కూల్ సిబ్బంది సహా 17మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు పాల్పడిన నికోలస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అతడు పోలీసులకు పై విధంగా సమాధానం చెప్పాడు. తన మానసిక పరిస్థితి ఎప్పుడూ చాలా ఆందోళనగా ఉండేదని, ఎవరో తనను పిలిచినట్లుగా అనిపిస్తుండేదని, తనకు పుర్రెల్లో రకరకాల శబ్దాలు వినిపిస్తుండేవని పోలీసులకు చెప్పాడు. వాటిని తాను దెయ్యాలుగా భావిస్తున్నానని, అవే తనకు ఆదేశాలు చేశాయని ఆ క్రమంలోనే కాల్పులకు తెగబడినట్లు అతడు పోలీసులకు చిత్ర విచిత్రమైన సమాధానాలు చెబుతున్నాడు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







