భారతీయ సినిమా గాన చరిత్రలో ఆశాభోస్లేకు 'య‌శ్‌చోప్రా అవార్డ్‌'

- February 17, 2018 , by Maagulf
భారతీయ సినిమా గాన చరిత్రలో ఆశాభోస్లేకు 'య‌శ్‌చోప్రా అవార్డ్‌'

భారతీయ సినిమా గాన చరిత్రలో ఆశాభోస్లే గానం ఒక శకం. జలపాత తరంగంలా ఎంతో మందిని అలరించింది ఆశా భోస్లే. దాదాపు 70 ఏళ్లుగా ఆశా సినిమాల్లో పాట‌లు పాడుతున్నారు. హిందీలో ఎన్నో సినిమాల్లో పాట‌లు పాడిన ఆశాకి లెక్క‌లేనంత మంది అభిమానులు ఉన్నారు. దాదాపు నాలుగు తరాలుగా పాడుతున్న ఆశా.. ప్లేబ్యాక్ ఇవ్వని హీరోయిన్ లేదంటే అతిశయోక్తి కాదు . ఇటీవ‌ల‌ ఢిల్లీలోని మేడం టుస్సాడ్స్ కార్యాలయంలో ఆమె విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఎంతో ఘ‌న‌త సాధించిన ఆశాబోస్లే తాజాగా య‌శ్ చోప్రా అవార్డు అందుకుంది. గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా ప్ర‌తీ సంవ‌త్స‌రం య‌శ్ చోప్రా పేరుతో మెమోరియ‌ల్ అవార్డు ఇస్తూ వ‌స్తుండ‌గా, తొలిసారి ల‌తా మంగేష్క‌ర్ ఈ అవార్డు అందుకుంది. ఆ త‌ర్వాత అమితాబ్ బ‌చ్చ‌న్‌, రేఖ‌, షారూఖ్ ఖాన్ అందుకున్నారు. ఈ సంవ‌త్స‌రం 84 ఏళ్ళ ఆశాబోస్లే ప్ర‌ముఖ హీరోయిన్ రేఖ చేతుల మీదుగా అవార్డు అందుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com