ఇస్రో యువికా 2026, 9వ తరగతి విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్
- February 27, 2026
భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలని కలలు కనే విద్యార్థులకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గొప్ప అవకాశం అందిస్తోంది.యువ శాస్త్రవేత్తల కార్యక్రమం యువికా–2026 (YUVIKA 2026) ద్వారా స్కూల్ విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానం, రాకెట్ సాంకేతికత, ఉపగ్రహ వ్యవస్థలపై చిన్న వయసులోనే అవగాహన కల్పించనున్నారు. సైన్స్ & టెక్నాలజీ రంగాల్లో కెరీర్ ఎంచుకోవాలనుకునే వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్‌గా భావిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి 2026 జనవరి 1 నాటికి దేశంలోని ఏ పాఠశాలలోనైనా 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభమై మార్చి 31 వరకు కొనసాగుతుంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఏప్రిల్ 13న మొదటి ఎంపిక జాబితా, ఏప్రిల్ 20న రెండో జాబితాను ఇస్రో ప్రకటిస్తుంది. ఎంపికైన విద్యార్థులకు మే 11 నుంచి మే 22 వరకు దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది ఇస్రో కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ అందించబడుతుంది.
తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, బెంగళూరులోని యు.ఆర్.రావు శాటిలైట్ సెంటర్ వంటి ప్రముఖ కేంద్రాల్లో శిక్షణ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అంతరిక్ష పరిశోధన, శాస్త్రీయ ప్రయోగాలు, ఉపగ్రహ సాంకేతికతపై ప్రాయోగిక అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యం.
ఎంపిక ప్రక్రియలో కేవలం మార్కులు మాత్రమే కాకుండా విద్యార్థుల ప్రతిభ, సైన్స్ ప్రాజెక్టులు, ఆన్లైన్ క్విజ్‌లలో పాల్గొనడం, సైన్స్ ఎగ్జిబిషన్లు, క్రీడలు, ఎన్సీసీ లేదా స్కౌట్స్ & గైడ్స్ కార్యకలాపాల్లో సాధించిన విజయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పాఠశాలల విద్యార్థులకు అదనంగా 15 శాతం వెయిటేజీ ఇవ్వడం విశేషం.
శిక్షణ కాలంలో వసతి, భోజనం, స్టడీ మెటీరియల్స్‌ను ఇస్రో ఉచితంగా అందిస్తుంది. విద్యార్థులు తమ నివాస ప్రాంతం నుండి శిక్షణ కేంద్రాలకు చేరుకోవడానికి అయ్యే ప్రయాణ ఖర్చులను కూడా సంస్థ తిరిగి చెల్లిస్తుంది. ఒరిజినల్ టిక్కెట్లు సమర్పిస్తే 2nd AC రైలు ఛార్జీ లేదా సమానమైన బస్సు ఛార్జీ రీయింబర్స్ చేయబడుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్ డ్యూటీ ఫ్రీలో $1 మిలియన్ గెలిచిన భారతీయుడు..!!
- GCC-ASEAN మధ్య ఆర్థిక, వాణిజ్య సహకార విస్తరణపై చర్చలు..!!
- భారీ వర్షాలు..అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు!
- హైదరాబాద్ విమానాశ్రయం–బ్రస్సెల్స్ విమానాశ్రయం మధ్య అవగాహన ఒప్పందం
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో వైట్ కోట్ సెరిమనీ
- ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు
- మారిషస్‌లో డా.గజల్ శ్రీనివాస్‌కు ‘విశ్వ సంగీత శాంతి దూత’ పురస్కారం
- ఇరాన్ 60 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన..హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభానికి ‘రోడ్‌మ్యాప్’
- మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు పేర్లు ఖరారు?
- అమెరికాలో ల్యాండైన జిన్‌పింగ్







