రెండు ముక్కలుగా తెగి పోయిన చేతిని శస్త్రచికిత్స ద్వారా సరిచేసిన సౌదీ వైద్యులు..
- February 18, 2018
రియాద్ : రెండు ముక్కలుగా తెగిపోయిన చేతిని అద్భుతమైన శస్త్రచికిత్స ద్వారా తిరిగి యధాతధంగా కలిపి అపర బ్రహ్మలుగా సౌదీఅరేబియా వైద్యులు అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఆసియాకు చెందిన ఓ కార్మికుడు సౌదీలో పనిచేస్తుండగా ఆ వ్యక్తి చెయ్యి రెండు ముక్కలుగా తెగిపడింది. మణికట్టు దిగువన చెయ్యి పూర్తిగా తెగిపోయింది. బాధితుడిని సౌదీ తూర్పు ప్రావిన్స్‌లోని ఖోబర్‌లోని కింగ్ ఫహద్ యూనివర్సిటీ హాస్పిటల్ కు శుక్రవారం తరలించారు. అక్కడ నిపుణులైన వైద్యులు దాదాపు 6 గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతంగా చేతిని రెండుగా అతికించినట్లు హాస్పిటల్ డైరెక్టర్ మొహమ్మద్ షహ్రనీ తెలిపారు. తమ ఆసుపత్రిలో అత్యాధునికమైన సౌకర్యాలు, వైద్యుల నైపుణ్యం, వారి ఏకాగ్రత, పట్టుదలే ఈ ఆపరేషన్ విజయవంతానికి ముఖ్య కారణమని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







