యు.ఎ.ఈ. పర్యాటకులకు 'మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా' ప్రవేసపెడుతున్న థాయిలాండ్

- November 27, 2015 , by Maagulf
యు.ఎ.ఈ. పర్యాటకులకు 'మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా' ప్రవేసపెడుతున్న థాయిలాండ్

రానున్న ఏసియన్ ఎకనామిక్ కమ్యునిటీ సమ్మేళనానికి యు.ఎ.ఈ. మరియు ఇతర దేశాలనుండి వచ్చే పర్యాటకులకు సదుపాయం కలిగించేలా, తన పర్యాటక రంగాన్నిఉత్తెజపరిచేలా థాయిలాండ్ ప్రభుత్వం 'మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా' METV సదుపాయాన్ని ప్రవేసపెట్టింది. 5,000 భాత్ లు (513 దిర్హాం) ఖరీదుగల ఈ ఆరునెలల METV, వీసా చెల్లుబడి అయ్యే కాల పరిధిలోగా, 60 రోజుల వరకు అపరిమిత సంఖ్యలో సరిహద్దును దాటగల అవకాశాన్ని కలిగిస్తుంది. టూరిస్టు వీసాకు అవసరమైన పత్రాలు మాత్రమే కాకుండా METV కి దరఖాస్తు చేసుకున్నవారు, కనేసం ఆరునెలల కాలవ్యవధి గల పాస్ పోర్టు లేదా ట్రావెల్ డాక్యుమెంట్, పూర్తిగా నింపబడిన వీసా దరఖాస్తు పత్రం, 2'X2'కొలత గల రెండు పాస్పోర్టు సైజు ఫోటోలు, శాశ్వత నివాస ధృవపత్రం , ప్రతినెల 20,000 భాత్ లకు తక్కువ కాకుండా ఉన్న 6 నెలల బాంకు స్టేట్ మెంటు, ఎంప్లాయిమెంట్ లెటర్; స్వయం ఉపాధి గల వారికి వారి పేరున గల బిజినెస్ లైసెన్స్ లేదా .. రిజిస్ట్రేషన్, విద్యార్ధులకు పూర్తికాలం విద్యార్ధి అని చూపే ఆధారం, ఎయిర్ టికెట్ నకలు , ఈ-టికెట్ లేదా ప్రయాణ మార్గాన్ని తెలిపే ఆధారం వంటి వాటిని దాఖలు చేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com