దుబాయ్ లో ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్లో సైనా,శ్రీకాంత్

- November 27, 2015 , by Maagulf
దుబాయ్ లో ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్లో సైనా,శ్రీకాంత్

భారత టాప్ షట్లిర్లు సైనా, కిడంబి శ్రీకాంత్ డిసెంబర్ 9 నుంచి దుబాయ్లో జరుగనున్న ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్లో ఆడనున్నారు. ప్రపంచ టాప్ 8 స్థానంలో ఉన్న పురుష, మహిళా ఆటగాళ్లు మాత్రమే ఇందులో ఆడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సైనా ప్రపంచ రెండోర్యాంక్లో ఉండగా శ్రీకాంత్ పురుషుల విభాగంలో 8వ స్థానంలో ఉన్నాడు. గత సంవత్సరం కూడా ప్రపంచ చాంపియన్ రజత విజేత సైనా , ఇండియా ఓపెన్ విజేత శ్రీకాంత్ అర్హత పొందినప్పటికీ, సెమీస్ దాటి ముందుకు వెళ్లలేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com