బహ్రెయిన్ ఫుడ్ ఫెస్టివల్ సూపర్ హిట్
- March 05, 2018
మనామా: బహ్రెయిన్ ఫుడ్ ఫెస్టివల్ సూపర్ హిట్ అయ్యిందని బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్ సొసైటీ (బిటిఇఎ) పేర్కొంది. ఫిబ్రవరి 22న ప్రారంభమైన ఈ ఫెస్టివల్ మార్చి 10 వరకు కొనసాగనుంది. ఇప్పటిదాకా 80,000 మందికి పైగా విజిటర్స్ బహ్రెయిన్ ఫుడ్ ఫెస్టివల్‌ని సందర్శించారు. 70కి పైగా ఔట్లెట్స్ ఈ ఫెస్టివల్లో కొలువుదీరాయి. లోకల్ బిజినెస్‌లు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, న్యూట్రిషన్ మరియు కలినరీ ఎక్విప్మెంట్ ఇంకా చాలా ఇక్కడ ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. మిడిల్ ఈస్ట్, వెస్టర్న్, ఏసియన్, ఇండియన్, ఆర్గానిక్ మరియు హెల్తీ కసిన్స్ని సందర్శకులు ఎంతో ఇష్టంగా ఆరగించారు. ఫుడ్ ఫెస్టివల్ సూపర్ హిట్ అవడం చాలా ఆనందంగా ఉందని బిటిఇఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షేక్ ఖాలెద్ బిన్ హమూద్ అల్ ఖలీఫా చెప్పారు. బహ్రెయిన్ ఫుడ్ ఫెస్టివల్లో సందర్శకులకు కుకింగ్ షో, మ్యూజికల్ షో, ఫన్ యాక్టివిటీస్ మధురానుభూతుల్ని కలగజేస్తున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







