1000 సినిమాలు పూర్తి చేసుకున్న ఇళయరాజా..!!
- November 28, 2015
గర్వించదగ్గ భారతీయ సంగీత దర్శకుల్లో ఒకరైన ఇసైజ్ఞాని ఇళయరాజా బాణీలు కట్టిన 1000వ చిత్రం'తారై తప్పట్టై'ఆడియో డిసెంబర్ 17న విడుదల కాబోతోంది. తన స్వరాలతో కోట్లాదిమంది శ్రోతల హృదయాలను మీటిన ఇళయరాజా తన వెయ్యవ చిత్రానికి ఎలాంటి బాణీలు అందించారోనని సగటు అభిమానిలో ఆసక్తి నెలకొంది. అందుకే 'తారై తప్పట్టై' ఆడియోను చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచ సినీ చరిత్రలోనే వెయ్యి చిత్రాలకు సంగీతం అందించి అరుదైన మైలురాయిని చేరుకున్న ఇళయరాజాను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించాలని దర్శకుడు, నిర్మాత బాలా ఏర్పాట్లు చేస్తున్నారు. భారతీయ సినీ అతిరథ మహారథులందర్నీ ఆ వేడుకకు పిలిచి, వారందరి సమక్షంలో ఇళయరాజాను సన్మానించాలన్నది బాలా యోచనగా తెలుస్తోంది. కాగా, శశికుమార్, వరలక్ష్మి జంటగా నటించిన 'తారై తప్పట్టై' పొంగల్‌కు విడుదల కాబోతుంది.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









