ఆ ఉల్లంఘనలకు జైలు శిక్ష లేదు
- March 07, 2018
రియాద్: వాహనాల్ని నడుపుతూ మొబైల్ ఫోన్ నడపడం, అలాగే వాహనం నడుపుతున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి ఉల్లంఘనలకు సంబంధించి జైలు శిక్ష ఉండదని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ స్పష్టతనిచ్చింది. ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్, ఇటీవలే ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో మానిటరింగ్ చర్యలు ప్రారంభించింది. మొబైల్ ఫోన్, సీటు బెల్టుకి సంబంధించి ఉల్లంఘనల్ని ఈ పద్ధతుల్లో గుర్తిస్తున్నారు. ఈ రెండు ఉల్లంఘనలకు గాను కనిష్టంగా 150 సౌదీ రియాల్స్, గరిష్టంగా 300 సౌదీ రియాల్స్ జరీమానా విధించనున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ - ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ కల్నల్ సమి అల్ షువైరిహ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. మొబైల్ ఫోన్ వినియోగిస్తూ వాహనాలు నడపడం ప్రమాదాలకు దారి తీస్తోందని ఆయన అన్నారు. సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల ప్రమాదం జరిగినా ప్రాణాలు కాపాడుకోవచ్చని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







