జబెల్‌ అక్దర్‌లో రోడ్డు ప్రమాదం: ముగ్గురు విద్యార్థుల మృతి

- March 07, 2018 , by Maagulf
జబెల్‌ అక్దర్‌లో రోడ్డు ప్రమాదం: ముగ్గురు విద్యార్థుల మృతి

మస్కట్‌: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్కూలు విద్యార్థులు మృతి చెందగా, 17 మంది గాయపడ్డ ఘటన జబెల్‌ అక్దర్‌లో చోటు చేసుకుంది. వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్‌ కంట్రోల్‌ తప్పడంతో, బస్‌ ఓవర్‌ టర్న్‌ అయ్యింది. గాయపడ్డవారిని తక్షణం ఆసుపత్రికి తరలించగా, వారిలో కొందరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. హెలికాప్టర్‌ ద్వారా బాధితుల్ని ఎయిర్‌లిఫ్ట్‌ చేశారు. 17 మందిలో 12 మంది కోలుకోగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. హిల్‌ ఏరియా కావడంతో కేవలం 4డబ్ల్యుడి మాత్రమే ఈ ప్రాంతంలో అనుమతించబడ్తోంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల్ని ఎస్‌వీయూ ద్వారా తరలించారు. గడచిన పదిహేను రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇదే ప్రధమం. గతంలో ఫిబ్రవరి 20న ఇబ్రిలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com