మునక్కాయ, మటన్ దాల్చ
- March 08, 2018
కావలసిన పదార్థాలు: మసూరి దాల్ (ఎర్రపప్పు) - 100 గ్రా., శనగపప్పు - 50 గ్రా., ఆవాలు - 5 గ్రా., లవంగాలు - 2, దాల్చినచెక్క - అంగుళం ముక్క, వెల్లుల్లి - 10 గ్రా., మటన్ - అరకేజి, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, ఉల్లిపాయలు - 2, కరివేపాకు - 4 రెబ్బలు, పచ్చిమిర్చి - 10, మునక్కాయలు - 2, పుదీనా - 1 కట్ట, ఆమ్‌కా చూర్ - 10 గ్రా., కారం - అర టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, నెయ్యి - 50 గ్రా., ఉప్పు - రుచికి తగినంత, మటన్ స్టాక్ - అర లీటరు.
తయారుచేసే విధానం: మసూరి, శనగపప్పులను ఒక గంటసేపు నానబెట్టాలి. నూనెలో అల్లం వెల్లుల్లి పేస్టు వేగించి మటన్, నానిన పప్పులు, స్టాక్ వేసి మెత్తగా ఉడికించాలి. మరో కడాయిలో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, లవంగాలు, దాల్చిన చెక్క, కరివేపాకు, మునక్కాయ (రెండు అంగుళాల) ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేగించాలి. మునక్కాయలు మెత్తబడ్డాక ఉడికించిన మటన్, పప్పుల మిశ్రమాన్ని కలిపి తగినంత ఉప్పు వేసి రెండు నిమిషాల తర్వాత ఆమ్‌కా చూర్, పుదీనా, నెయ్యి కలిపి దించేయాలి. ఈ దాల్చా బిర్యాని రైస్‌తో ఎంతో రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ సహా సరికొత్త ఆర్థిక నేరాలపై ఫోకస్: డీజీపీ అంజనీ కుమార్
- ముగిసిన హెచ్-1బీ వీసా అప్లికేషన్లు..
- మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం..39 మంది మృతి
- హైదరాబాద్ లో ఆస్కార్ విజేత చంద్రబోస్‌కు సత్కారం..
- జీ-20 సదస్సు-2023కు విశాఖ రెడీ
- ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..
- హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి
- పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- అదనపు ఆదాయాన్నిచ్చే ‘సెకండ్ శాలరీ’..!
- ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!