రెస్టారెంట్ లో ఒకరినొకరు తన్నుకున్న మహిళలు
- March 09, 2018
కువైట్ : నాలుగు కొప్పులు ఒక చోట చేరితే మహా ప్రళయమని మన తెలుగులో ఓ సామెత ఉంది....మరి గల్ఫ్ దేశంలో రెండు కొప్పులు ఒక చోట చేరితే సరిపోతుందేమో బాహాబాహీగా ఒకరిపై ఒకరు దాడి చేసుకొని కొట్లాడుకొంటారేమో ? ఒక పబ్లిక్ రెస్టారెంట్ లో ఇరువురు మహిళలు ఒకరినొకరు తీవ్రంగా కొట్లాడుకోవడంతో ఆ మహిళలు అరెస్టయ్యారు. సెక్యూరిటీ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం తన భర్తతో ఒక మహిళ భోజనానికి కూర్చొంది. అల్లంత దూరాన ఉన్న మరో మహిళ తన భర్త వంక పదే పదే చూడటం..వెకిలి నవ్వులు నవ్వడం..కనురెప్పలు పైకి ఎగురవేయడం తదితర వెకిలి చేష్టలు చేయడంతో ఆ భార్యామణి తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలిపారు.అసూయ ..ఆపై అనుమానం పెంచుకున్న ఆ భార్య పట్టరాని కోపంతో దూరంగా తన భర్తకు ఎదురుగా కూర్చొని ఉన్న ఆ మహిళ వద్దకు వెళ్లి రెస్టారెంట్ ను విడిచిపెట్టాలని డిమాండ్ చేసింది, దాంతో అందుకు వ్యతిరేకించిన ఆ మహిళ ఒకరినొకరు ఒకరు జుట్లు పట్టుకొన్నారు. ఒకరిపై ఒకరు బలంగా చేతులతో దాడి చేసుకొన్నారు. జరుగుతున్న ఈ పోరాటంలో మధ్యలోకి వెళ్ళి వారిని శాంతి పర్చే సాహసం చేయలేక రెస్టారెంట్ సిబ్బంది పోలీసులను ఫోన్ ద్వారా పిలిచారు.
తాజా వార్తలు
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







