దుబాయ్:డిస్కవరీ గార్డెన్స్ లో 5 కార్లు దగ్ధం
- March 09, 2018
దుబాయ్: శుక్రవారం మధ్యాహ్నం డిస్కవరీ గార్డెన్స్ లో ఒక కారు లోపల నుంచి మంటలు వెలువడటంతో ఒక అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మధ్యాహ్నం1.38 సమయంలో సమాచారం అందుకొన్న అల్ బర్సా సివిల్ డిఫెన్స్ జట్టు ఆ ప్రాంతానికి 1:39 సమయంలో చేరుకొన్నారు. వెనువెంటనే ఆ అగ్నిమాపకదళ సిబ్బంది ఏకకాలంలో అగ్నికీలలు చుట్టుముట్టి తగలబడిపోతున్న 5 కార్లను సంఘటనా స్థలంలో కనుగొన్నారు. ఆ వాహనాలలో మంటలు నియంత్రిస్తూ వారు భారీ పొగతో ఉక్కిరిబిక్కిరయ్యారు. పోలీస్ అధికారులు ఆ ప్రాంతంపై చేరుకొని ఆ సమీపంలో ట్రాఫిక్ అవరోధాలను చక్కదిద్ది ఆ ప్రాంతమును తమ అదుపులో తెచ్చుకొన్నారు. ఈ అగ్ని ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా మంటలలో కాలి బూడిదయ్యాయి. మిగిలిన మూడు కార్లు స్వల్పంగా తగలబడ్డాయి. అగ్నిప్రమాదం జరిగిన అరగంట వ్యవధిలో మధ్యాహ్నం 2.14 సమయానికి అగ్నిమాపకదళ సిబ్బంది మంటలను పూర్తిగా నియంత్రించారు. అయిదు కార్లు ఏ విధంగా మంటలలో చిక్కుకొన్నాయో అనే వాస్తవ కారణం కనుగొనేందుకు సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించారు
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







