కార్ డ్రిఫ్టింగ్: ఒమన్‌లో ముగ్గురి అరెస్ట్
- March 09, 2018
మస్కట్: కార్ డ్రిఫ్టింగ్ నేరానికిగాను ముగ్గురు పౌరుల్ని స్టేట్ ఆఫ్ ధాంక్‌లో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. అల్ దహిరా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ముగ్గురు పౌరులు ఆధారాలతో సహా, నేరానికి పాల్పడినట్లు నిర్ధారించబడ్డారు. వీరిని తదుపరి చర్యల నిమిత్తం జ్యుడీషియల్ అథారిటీస్‌కి అప్పగించారు. వాహనదారులు, ముఖ్యంగా యువత, డ్రిఫ్టింగ్ మోజులో పడి ఇతరుల ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరించరాదని పోలీసులు హెచ్చరించారు. రోడ్ సేఫ్టీని ప్రతి ఒక్కరూ పాటించాలనీ, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







