బిపిఎల్ 2018: ఇండియన్ క్రికెటర్ ప్రశంసలు
- March 09, 2018
భారత క్రికెటర్ హర్భజన్ సింగ్, బహ్రెయిన్‌లో జరుగుతున్న కోకాకోలా బహ్రెయిన్ ప్రీమియర్ లీగ్ 2018 నిర్వహణ పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్పెసలిస్ట్ స్పిన్నర్‌గా హర్భజన్ సింగ్, భారత క్రికెట్‌కి విశేషమైన సేవలందించిన సంగతి తెల్సిందే. బహ్రెయిన్‌లో కెహెచ్కె స్పోర్ట్స్, ఎక్సెలాన్ సహకారంతో తొలి టీ20 క్రికెట్ టోర్నమెంట్‌ని నిర్వహించింది. బహ్రెయిన్‌లో యువ క్రికెటర్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ టోర్నమెంట్‌ని నిర్వహిస్తున్నారు. ఈ ఆలోచనని హర్భజన్‌సింగ్ అభినందించాడు. సుప్రీం కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఫస్ట్ డిప్యూటీ ఛైర్మన్, బహ్రెయిన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఖాలిద్ బిన్ హమాద్ అల్ ఖలీఫా సమక్షంలో ఈ పోటీలు జరిగాయి. టీ20 ఫార్మాట్లో 13 రెసిడెంట్ క్రికెటర్స్‌తో ఆరు ఫ్రాంచైజీ స్క్వాడ్స్‌తో బహ్రెయిన్ ప్రీమియర్ లీగ్ జరిగింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







