గ్యాస్ సిలెండర్ పేలడంతో ఐదుగురు ఆసుపత్రి పాలు
- March 10, 2018
దుబాయ్ : ఎడారి దేశంలో నలభీమపాకంలో నిమగ్నమైన ఆ అయిదుగురు కార్మికులు గ్యాస్ సిలెండర్ లీకేజీని గమనించలేదు ..అంతే ఒక్కసారిగా పేలడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక అల్ జార్ఫ్ పారిశ్రామిక ప్రాంతంలో చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారంతా ఆసియా దేశాలకు చెందిన వలస కార్మికులని పోలీసులు పేర్కొంటున్నారు. వీరిని వెంటనే షేక్ ఖలీఫా ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం గం.3-20 నిమిషాలకు తమకు ఈ పేలుడు సమాచారం అందిందని పోలీసులు చెప్పారు. వెంటనే సంఘటన జరిగిన స్థలానికి వెళ్లి బాధితులను రక్షించే యత్నం చేసినట్లు ఆ అధికారులు తెలిపారు. సిలెండర్ లీకేజీ కారణంగానే పేలుడు సంభవించిందని పోలీసులు చెప్పారు. సరైన రక్షణ చర్యలు తీసుకోలేదని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న అన్ని కంపెనీల యజమాన్యాలను పిలిచి మీటింగ్ ఏర్పాటు చేశామని పోలీసులు చెప్పారు. గ్యాస్ సిలెండర్లు నింపేటప్పుడు వాటిని ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారికి సూచించామన్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







