వేధింపులకు గురైన గృహ సేవకురాళ్లకు న్యాయం కోసం కొత్త చట్టం

- March 10, 2018 , by Maagulf
వేధింపులకు గురైన గృహ సేవకురాళ్లకు న్యాయం కోసం  కొత్త చట్టం

అబుదాబి: పిల్లా పాపాలను వదిలి దేశం కానీ దేశం వెళ్లిన గృహ సేవకురాళ్లకు న్యాయం కోసం ఓ కొత్త చట్టంఅబుదాబి ప్రభుత్వం తీసుకురానుంది . దీని అమలు కోసం  ప్రత్యేకమైన ఓ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ట్రిబ్యునల్ ద్వారా వేధింపులు, ఇతర నేరాలకు గురైన బాధిత మహిళలకు సంబంధించిన కేసులలో సత్వర విచారణ జరగనుంది. తద్వారా బాధిత మహిళలకు న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతో ఈ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఉపప్రధాని, అధ్యక్షవ్యవహారాల మంత్రి, అబుదాబి జ్యూడిషియల్ అధిపతి షేక్ మన్షూర్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఓ తీర్మానాన్ని బుధవారం ప్రవేశపెట్టారు. ఈ చట్టం చట్టం అమల్లోకి వస్తే పని మనుషుల వేధింపుల కేసుల విచారణను ప్రత్యేకంగా చేపడుతారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారు. బతుకుదెరువు కోసం ఆసియా దేశాలకు చెందిన అనేక మంది మహిళలు గల్ఫ్ దేశాలు వెళ్తున్నారు. యజమానుల చిత్రహింసలకు గురువుతున్నారు. బాధితుల్లో భారత మహిళల సంఖ్య కూడా అధికంగా ఉన్న విషయం తెలిసిందే.. ఈ చట్టం అమల్లోకి వస్తే అన్యాయానికి గురైన మహిళలకు ఎంతో కొంత  మేలు జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com