సౌదీ అరేబియాలో కారు ఎక్కిన యువతిని వేధించిన టాక్సీ డ్రైవర్..వీడియో ద్వారా బట్టబయలు
- March 14, 2018
జెడ్డా :' నాలో ఉన్న కోర్కె.... నీతో చెప్పనా ' అంటూ తనకు ఉన్న ప్రత్యేకమైన కోరికలను తీర్చాలంటూ మదీనాలో ఒక సౌదీ టాక్సీ డ్రైవర్ కారు ఎక్కిన యువతిని పదే పడే వేధిస్తున్న ఓ వీడియో పోలీసులకు లభించడంతో టాక్సీ డ్రైవర్ వేడి వేడి కోర్కెను పోలీసులు తీర్చే పనిలో పడ్డారు. ఒక నిమిషం పాటు కొనసాగి ఈ వీడియోలో తన ప్రత్యేక అవసరాలను తీర్చమని వేధిస్తూ..ఇబ్బంది పెట్టాడు. చివరకు ఆ టాక్సీ డ్రైవర్ పోలీసులకు పట్టుబడ్డారు. కారు ఎక్కిన నుంచి ఆ యువతిని సతాయిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాబడింది. లక్షలమంది ఈ వీడియోను చూడటమే కాక ఆ కీచక డ్రైవర్ పట్ల కోపంతో ఉండటమే కాక నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలనీ డిమాండ్ పలువురు సౌదీ దేశీయులు డిమాండ్ చేశారు. ఒక ప్రైవేట్ టాక్సీ కంపెనీతో పనిచేస్తున్న ఆ యువకుడు తన వెనుక సీట్లో ఉన్న అమ్మాయిని శారీరకంగా వేధించాడు. అంతేకాక తనతో మాట్లాడమని పదే పదే కోరాడు. ఎంతకీ ఆ అమ్మాయి మాట్లాడలేదు. దాంతో "ఎందుకు మీరు నాకు మాట్లాడటం లేదు? మీకు ఏమైనా చెవుడు ఉందా ? అంటూ మాట్లాడే యత్నం చేసాడు. కారు వెనుక భాగాన ఉన్న అమ్మాయి కి భయంతో ఏడుపు వస్తుంది. కళ్ళల్లోంచి వస్తున్న కన్నీటిని ఆపుకొనేందుకు ప్రయత్నించింది. అప్పటికి ఏమాత్రం తగ్గని ఆ టాక్సీ డ్రైవర్ ఆ యువతితో " మీరు అచ్చం చందమామ మాదిరిగా ఎంతో అందంగా ఉన్నారని అంటూ డ్రైవింగ్ చేయడం ఆపి వెనుక సీట్లో ఉన్న ఆ యువతీ వద్దకు చేరుకొన్నాడు. సమయంలో కారు లోపల లైట్లు, ఆమె తల తిరిగి సీటులో ఆమె వైపుకు చేరుకుంది. కారులోని లైట్లు స్విచ్ ఆఫ్ చేసి బాధితురాలిని తాకేందుకు ప్రయత్నించాడు. దాంతో ఆ యువతీ ఆమె తనపై జరుగుతున్న దారుణాన్ని..నిందితుదీని గుర్తించేందుకు వీలుగా ఆమె వీడియో తీయడం ప్రారంభించింది. దాంతో ఆ నిందితుడు ఆమె తన ఫోన్ తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఆమె ఆ నిందితుడికి దానిని దక్కనీయలేదు. ఈ ఘటన జరిగిన 10 గంటల కంటే తక్కువ సమయంలో అటార్నీ జనరల్ షేక్ సౌదీ బిన్ అబ్దుల్లా మదీనా ప్రాంతంలో పోలీసులకు ఆ 20 ఏళ్ళ డ్రైవర్ పట్టుబడ్డారు లాయర్ మజేద్ గారౌబ్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ " అధికారిక ఫిర్యాదుల అవసరం లేకుండా ప్రజల ప్రాసిక్యూషన్ నుండి సానుకూల మరియు మెరుగైన సంకర్షణకు ఇది ఉదాహరణ ... ప్రాసిక్యూషన్ ఈ అంశంపై పూర్తి బాధ్యత వహించింది, ప్రత్యేక అవసరాలతో అమ్మాయి ఫిర్యాదు అవసరం లేకుండా నిందితుడిపై విచారణ ప్రారంభించారు. "
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







