మూగవాడిగా నారా రోహిత్.!
- March 14, 2018
నారా రోహిత్ కెరీర్ మొదటి నుండి వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూపోతున్నాడు. హీరోయిజం లెక్కకు వేయకుండా కధ నచ్చితే ఎంతటి రిస్క్ అయినా చేసున్నాడు. ఈ క్రమంలో ఆయన నుండి కొన్ని వైవిధ్యమైన సినిమాలు వచ్చాయి. తాజాగా మరో ప్రయోగం.
నారా రోహిత్ కథానాయకుడిగా మంజునాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభమైంది. అట్లూరి నారాయణరావు నిర్మాత. ఈ చిత్రంలో రోహిత్ మూగవాడిగా నటించబోతున్నాడు. రంగస్థలంలో చరణ్ చెవిటివాడిగా నటిస్తున్నాడు. రాజా ది గ్రేట్‌లో రవితేజకు కళ్లు లేవు. వీరిచ్చిన ధైర్యంతో ఏమో.. నారా రోహిత్ మరో అడుగు ముందుకు వేశాడు. ఈ సినిమా విజయం సాధిస్తే కనుక మరిన్ని ప్రయోగాలు వచ్చే అవకాశం వుంది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







