ఇరాన్‌ ఎయిర్‌లైన్స్‌లో ఇకపై మహిళా పైలట్లు

- March 14, 2018 , by Maagulf
ఇరాన్‌ ఎయిర్‌లైన్స్‌లో ఇకపై మహిళా పైలట్లు

మొదటిసారిగా మహిళా పైలట్లను అనుమతించనున్నట్లు ఇరాన్‌ జాతీయ వైమానిక సంస్థ ఇరాన్‌ ఎయిర్‌ ఇటీవలనే ప్రకటించింది. ఇరాన్‌ వైమానిక చరిత్రలోనే తొలిసారిగా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు చేపట్టిన ఫర్జానె షరఫ్‌బఫి ఈ మేరకు ప్రకటన చేస్తూ, ఇకపై తమ సిబ్బందిలో మహిళా పైలట్లు వుండడం తమందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఇరాన్‌లో ఇప్పటికీ మహిళలు బయటకు వస్తే, చివరకు విమానాల్లో కూడా తలకు ముసుగు ధరించాల్సిందే. ఆసియా, యూరప్‌ల్లో పలు నగరాలకు, దేశీయంగా 25 ప్రాంతాలకు ఇరాన్‌ ఎయిర్‌ విమానాలు నడుపుతోంది. ఏడాదికి ఒకసారి ఖాళీలను భర్తీ చేయడానికి ఇరాన్‌ ఎయిర్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈసారి పైలట్లుగా మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కోరింది. ప్రస్తుతం ఎయిర్‌లైన్స్‌ సంస్థలో ఉన్నతస్థాయిలో ఐదుగురు మహిళలు పనిచేస్తున్నారు. సంస్థలోని మధ్య స్థాయి మేనేజర్లలో దాదాపు 16శాతం మంది మహిళలే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com