డ్రైవింగ్ లైసెన్సులను పరిశీలించేందుకు ఒక శాశ్వత ప్యానెల్
- March 14, 2018
కువైట్ : చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ప్రవాసీయుల డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయో లేదో పరిశోధించడానికి ఒక శాశ్వత ప్యానెల్ ను ఏర్పాటు చేయడానికి ఒక ప్రతిపాదనను జాతీయ అసెంబ్లీ అంతర్గత మరియు రక్షణ సంఘం ఆమోదించింది. ఈ ప్రతిపాదన ప్రకారం, జారీ చేసిన లేదా పునరుద్ధరణ సమయంలో ప్రవాసీయులకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్సుల అన్నింటిని కమిటీ పరిశీలిస్తుంది. . కువైట్ ట్రాఫిక్ చట్టం ప్రకారం, కువైట్ లో నివసిస్తున్న మరియు పనిచేస్తున్న ప్రవాసీయులు ఒక డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోగల పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి కనీసం 600 కువైట్ దినార్ల నెలసరి జీతం సంపాదించి, కువైట్ లో రెండు సంవత్సరాల నివాసం పూర్తి చేసి ఉండటమే కాక లైసెన్స్ పొందగోరేవారు విద్యార్హతగా ఒక విశ్వవిద్యాలయ డిగ్రీ కలిగి ఉండాలి . అయితే, కువైట్ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్ధులు, కుటుంబాల ప్రైవేట్ డ్రైవర్లు, వైద్యులు, న్యాయమూర్తులు, ఇంజనీర్లు మరియు పలు ఇతర సీనియర్ నిపుణులు, పిల్లలతో గృహిణులు, రాయబారులు మరియు ఇతరులుగా పనిచేసేవారితో పాటు అనేక మినహాయింపులు ఉన్నాయి. కానీ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారు మినహాయింపులలో ఒకదానిపై ఆధారపడి వారు ఆ పరిస్థితులను కోల్పోయిన తర్వాత లైసెన్స్ ను వదులుకోవాలి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







