అగ్నికి ఆహుతైన కొత్త జంట

- March 14, 2018 , by Maagulf
అగ్నికి ఆహుతైన కొత్త జంట

దుబాయ్ : పంచభూతాలతో పరాచికాలు అస్సలు వద్దని పెద్దలు హెచ్చరిస్తుంటారు.. ముఖ్యంగా భూమి, ఆకాశం కన్నా నీరు... నిప్పు... గాలి.. అకస్మాత్తుగా విరుచుకుపడి అంతు చూసేస్తాయి అనడానికి ఎన్నో ఉదాహరణలు లోకంలో వున్నాయి. దుబాయిలో ఉద్యోగం చేస్తున్న ఓ యువకుని మరణం పలువురిని కలిచివేస్తుంది. చావు కోసమే భార్యతో సహా భారతేదేశానికి వచ్చినట్లైందని పలువురు వేదన చెందుతున్నారు.   దుబాయిలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న తమిళనాడుకి చెందిన వివేక్  పెళ్లైన 100 రోజుల సందర్భంగా స్వదేశంలో అందరినీ చూసేందుకు దుబాయ్ నుంచి తమిళనాడులోని తమ స్వంత ఊరికే ఎంతో సంతోషంగా చేరుకున్నారు. తన ప్రాణ స్నేహితులందరితో కలిసి భార్యను వెంటబెట్టుకుని విహారయాత్రకు అడవిలోకి వెళ్లాడు వివేక్. అయితే ఆ సమయంలో అడవిలో చెలరేగిన కార్చిచ్చు ఆ నూతన జంటను సజీవంగా దహించివేసింది. .మంటలలో తీవ్రంగా గాయపడిన ఆ భార్యాభర్తలను స్థానికంగా ఉన్నఆసుపత్రికి హుటాహుటిన తరలించినప్పటకి 70 శాతం వళ్ళు కాలిపోవడంతో వారు విషాదంగా మరణించారు. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య బుధవారం ఉదయం నాటికి 11కి చేరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com