పార్కింగ్ టికెట్ టాంపరింగ్: మహిళకు జైలు
- March 14, 2018
దుబాయ్:25 ఏళ్ళ మహిళకు మూడు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. పార్కింగ్ టిక్కెట్ టాంపరింగ్‌కి పాల్పడినందుకుగాను న్యాయస్థానం నిందితురాలికి శిక్ష విధించింది. జర్మనీకి చెందిన మహిళపై ఫోర్జరీ కేసు నమోదు చేసిన ప్రాసిక్యూషన్, కఠిన శిక్ష విధించాలని న్యాయస్థానానికి అభ్యర్థించింది. 2016 జూన్ 16న ట్యాంపరింగ్ ఘటన జరిగినట్లు అల్ కువైస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. కార్లను పెయిడ్ పార్క్‌డ్ ఏరియాలో పరీక్షిస్తుండగా, ఓ టిక్కెట్ మీద హ్యాండ్ రైటింగ్‌తో ట్యాంపరింగ్ జరిగినట్లు గుర్తించానని జోర్డాన్‌కి చెందిన 51 ఏళ్ళ ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు. మే 16కి సంబంధించిన టిక్కెట్‌ని జూన్ 16గా నిందితురాలు మార్చారు. విచారణలో నిందితురాలు తన నేరాన్ని అంగీకరించారు. మే నెల నంబర్ 5 కాగా, దాన్ని జూన్ నెల నెంబర్ అయిన 6గా మార్చింది నిందితురాలు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..