స్కూల్ బస్ ప్రమాదం: విద్యార్థి మృతి
- March 14, 2018
మస్కట్: అదామ్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి చనిపోగా, 12 మంది గాయపడ్డారు. స్కూల్ బస్ - ట్రక్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అదామ్‌లోని స్కూల్‌లో విద్యార్థులు చదువుతున్నారు. ఉసామా బిన్ జాయెద్ స్కూల్‌కి చెందిన 5 నుంచి 9 అలాగే 10, 12 గ్రేడ్స్‌కి చెందిన విద్యార్థులతో బస్ వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు స్కూల్ యాజమాన్యం పేర్కొంది. విలాయత్ ఆఫ్ అదామ్‌లో రోడ్డు ప్రమాదం జరగగా, గాయాలపాలైనవారిని నిజ్వా ఆసుపత్రికి తరలించారు. తమ ఆసుపత్రికి 9 మందిని తీసుకొచ్చారనీ, వీరిలో 1కరు గ్రీన్ కేస్ కాగా, 6 ఎల్లో కేస్‌లు, 1 రెడ్ మరియు 1 బ్లాక్ కేస్ నమోదయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రమాదం కారణంగా కాలిన గాయాలవడంతో ఆ కేసుని రెడ్ కేస్‌గా పరిగణించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిస్థితిని సమీక్షిస్తోంది. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి మినీస్ట్రీ సంతాపం తెలిపింది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..