గృహ సంబంధిత ఉల్లంఘనలపై అబుదాబి సిటీ మునిసిపాలిటీ ఉక్కుపాదం
- March 14, 2018
అబూధాబి: వాణిజ్య భవనాలు ఉండే ప్రాంతాలలోని వసతి గృహలలో ఎక్కువ మంది ప్రజలు కిక్కిరిసిపోయి నివసించడంపై అధికారులు విస్తృతమైన తనిఖీలు నిర్వహించారు. ఈ అవగాహన ప్రచారం అల్ వాత్బాలోని కేంద్రం ద్వారా అబుదాబి సిటీ మునిసిపాలిటీ ఇటీవల ప్రారంభించించి బనియాస్, షావమేఖ్ మరియు అల్ వాత్బాలోని అనేక ప్రాంతాలలో భవనాల వెలుపల సైతం తనిఖీలు నిర్వహించబడ్డాయి. ఆరోగ్యం , భద్రతా ప్రమాణాలు ఈ ప్రచారం ద్వారా మెరుగుపర్చేందుకు అధికారులు చర్యలు తీసుకొన్నారు. ఈ తనిఖీలు ఇవి నగర సుందిరీకరణ ప్రదర్శనల ప్రమాణాలకు అనుకూలంగా ఉంటాయి. వివిధ ప్రాంతాలలో 96 తనిఖీ పరీక్షల ఫలితంగా,మునిసిపాలిటీ 14 ఉల్లంఘనలను జారీ చేసింది. ఈ మొత్తం10 వేల అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్ నుంచి 1 లక్ష అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్ కంటే తక్కువ కాకుండా జరిమానా చెల్లించాల్సిఉంది. అవే తప్పులను ఉల్లంఘనదారులు మళ్ళీ చేస్తే 1 లక్ష అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్ తక్కువ కాకుండా 2 లక్షల అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్ లను జరిమానాగా విధించనున్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







