రష్యా:రన్ వేపై మూడు టన్నుల బంగారం
- March 15, 2018
రష్యా: కోట్లు విలువజేసే బంగారం విమాన రన్ వేపై వర్షంలా కురిసింది. అవును. టేకాప్ అయిన కొద్ది నిమిషాల్లోనే కార్గో విమానం తలుపు తెరచుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో నల్లటి రోడ్డుతో కనిపించే రన్ వేపై బంగారం చెల్లాచెదురుగా పడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రష్యాలోని యకుస్క్ ప్రాంతంలో గల ఓ విమానాశ్రయం నుంచి ఆన్-12 కార్గో విమానం గురువారం ఉదయం క్రస్నోయాస్క్కు బయల్దేరింది. ఆ విమానంలో బంగారం వంటి ఖరీదైన లోహాలను తరలిస్తున్నారు. అయితే టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం తలుపు తెరుచుకోవడంతో అందులో నుంచి బంగారం కడ్డీలు వర్షంలా పడ్డాయి.
దీంతో అప్రమత్తమైన అధికారులు విమానం నుంచి కిందపడ్డ 172 బంగారు కడ్డీలను గుర్తించారు. వీటి బరువు దాదాపు 3.4 టన్నులు ఉంటుందని తెలిపారు. విమానంలో మొత్తం 9.3 టన్నుల బంగారం ఉండగా అందులో కొంత కింద పడిపోయినట్లు వివరించారు. విమానం తలుపు సరిగా మూత పడకపోవడంతోనే ఇలా జరిగిందని చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







