ప్రవాసీయులకు మరియు కార్మికులకు 'IWRC'
- March 15, 2018
దుబాయ్:ప్రముఖ సంఘసంస్కర్త ,బీజేపీ తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు యమున పాఠక్ , గల్ఫ్ దేశంలో ఒక్కటైన(యు.ఏ.ఈ)దుబాయ్ పర్యటనలో భాగంగా ఆమె IWRC-ఇండియన్ వర్కర్స్ రిసోర్స్ సెంటర్(Initiative of Ministry of External Affair,Govt. of India) ని సందర్శించారు.భారత దేశ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వారి సహకారంతో స్థాపించిన ఈ సంస్థ ముఖ్య ఉద్దేశాలు- జాబ్ లో జీతం సమస్యలు,తక్కువ జీతం ,ఓవర్ టైం, మరియు వీసా రద్దు సమస్యలు,లీగల్,ఆర్ధిక ,వ్యక్తిగత,సమస్యలతో ఉన్న ఇక్కడ ప్రవాసీయులకు సూచనలు ఇచ్చే దిశగా ఈ సంస్థ కృషి చేయడం హర్హదాయకమన్నారు.వీరి పూర్తి వివరాలకు www.iwrcuae.in మరియు [email protected] స్థానికులు సంప్రదించగలరు.ఇంచు మించు రోజు వారిగా వారికీ సుమారు 250-300 కాల్స్ రావడం గమనార్ధం,కేంద్ర మంత్రి చొరవతో ఏర్పడ్డ ఈ సంస్థ ప్రవాస భారతీయుల సమస్య పరిష్కార దిశలో ముందడుగు వేయడం హర్షదాయకమన్నారు.
ప్రతి ఏటా ఎంతో మంది వలస కార్మికులు ఏజెంట్ల దురాగతాలకు మోసపోతుండగా, అందులో నిరక్షరాస్యులు ఉండటం గమనార్ధం, ఆ ఆ దేశాల నిభందనలు,సూచనలు తెలియక దళారీల చేతిలో మోసాలకు బలై,బహు ఇక్కట్లు పడటం సోచనీయమన్నారు.
ముఖ్యంగా వలస వెళ్లే కార్మికులలో తెలుగు రాష్ట్ర ప్రజలు అధిక సంఖ్య లో ఉండటం గమనార్ధమని,అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి వీరి సమస్యలు తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని,అలాగే కార్మికుల సంక్షేమార్థం నియమ నిభందలతో కూడిన పత్రంను కూడా కేంద్ర ప్రభుత్వంకు అందజేస్తామని ఆమె పేర్కొన్నారు.అందులో తప్పని సరిగా రాష్ట్ర 'హెల్ప్ డెస్క్' సెంటర్ ను ప్రతి విమానాశ్రయంలో ఏర్పాటు చెయ్యాలని వినతినికూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆమె అన్నారు.ప్రతి ఒక్క ఉద్యోగికి విదేశాలకు వెళ్లే ఇలా భారతదేశంలోనే ముందు అవగాహన కల్పించడం వల్ల ఎంతో మంది ప్రవాసీయులకు,కార్మికులకు మేలు కలిగే అవకాశం ఉందని రానున్న రోజులలో పతిష్ఠమైన ప్రణాళిక రూపొందించి భారత కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ని కలుసుకుని నివేదిక అందజేస్తామని ఆమె పేర్కొన్నారు.
ఆమెతో పాటు 'మాగల్ఫ్.కామ్' (ఫౌండర్) శ్రీకాంత్ చిత్తర్వు తదితరులు పాల్గొన్నారు.
ప్రవాసీయులకు మరియు కార్మికులకు అవగాహన కల్పించడంలో తనవంతు కృషి చేస్తానని శ్రీకాంత్ చిత్తర్వు తెలియజేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







