16 వేలమంది ఉద్యోగార్థులు ప్రయివేట్ ఉద్యోగాలలో నియమితులయ్యారు
- March 15, 2018
మస్కట్ : ఉద్యోగార్థుల కోసం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు నిరంతరాయంగా కృషి చేస్తూనే ఉన్నాయి. మంత్రుల మండలి ఆమోదం పొందిన తర్వాత డిసెంబర్ 3 వ తేదీ 2017 నుండి ఈ ఏడాది మార్చి 12 వ తేదీ వరకు వివిధ గవర్నరేటర్లలో 16,504 మంది పౌరులు వివిధ ప్రైవేటురంగ సంస్థలలో నియమితుల య్యారని మానవ వనురుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగాలు పొందినవారిలో పురుషుల సంఖ్య 11,121 గా ఉండగా, మహిళల సంఖ్య 5,383 గా ఉన్నట్లు తెలిపింది. ఉద్యోగులను పొందినవారిలో జనరల్ ఎడ్యుకేషన్ డిప్లొమా కన్నా తక్కువ విద్యార్హత కలవారు 8,186 మంది , సాధారణ విద్య డిప్లొమా కలవారు 5,520 మంది, హయ్యర్ ఎడ్యుకేషన్ డిప్లొమా లేదా యూనివర్సిటీ డిగ్రీ చదువుకున్నవారు 2,798 మంది ఉన్నారు. ఉద్యోగ నియామకాలలో టోకు, రిటైల్ వాణిజ్యం, ఉత్పాదక రంగాల విభాగాలు నిర్మాణ రంగంలో 33.4 శాతం మంది, టోకు మరియు చిల్లర వర్తక రంగంలో 14.5 శాతం ఉండగా, అలాగే ఉత్పాదక రంగంలో 13.7 శాతం మంది నియమితులయ్యారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







