39 మంది రచయితలు ఒక కళాకారుడు అవార్డులు వాపస్..

- November 30, 2015 , by Maagulf
39 మంది రచయితలు ఒక కళాకారుడు అవార్డులు వాపస్..

దేశంలో జరిగిన కొన్ని అవాంఛనీయమైన ఘటనలకు నిరసనగా 39 మంది రచయితలు, ఒక కళాకారుడు అవార్డులు వాపస్ ఇచ్చారని, ఈ విషయంలో పునరాలోచించాలని సాహిత్య అకాడమీ వారిని కోరిందని ప్రభుత్వం తెలిపింది. సాహిత్య అకాడమీ ప్రత్యేక కార్యనిర్వాహకవర్గ సమావేశం నిర్వహించి రచయితలు లేదా కళాకారులపై జరిగిన దాడులను, హత్యను ఖండిస్తూ తీర్మానించిందని, ఆ ఘటనలకు నిరసనగా అవార్డులు తిరిగి ఇచ్చిన వారిని మరోసారి ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేసిందని కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి మహేశ్‌శర్మ లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com