కేరళ ప్రమాదంలో యూఏఈకి చెందిన కుటుంబం మృతి
- March 17, 2018
యూఏఈకి చెందిన ఇండియన్ మ్యాన్, అతని కుటుంబంతో కలిసి వెకేషన్‌కి స్వదేశంలోని కేరళకు వెళ్ళి, ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 40 ఏళ్ళ కొలండైతువీటిల్ షిబు, 34 ఏళ్ళ అతని భార్య సిజి, 11 ఏళ్ళ వారి కుమారుడు కొల్లామ్‌లోని ఛతనూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 7 ఏళ్ళ చిన్నారి ఆదిష్ ఈ ప్రమాదంలో గాయాలతో బయటపడ్డాడు. మధ్యాహ్నం 2.30 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నలుగురూ బైక్ మీద వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు మృతుల ఫ్యామిలీ ప్రెండ్ షిజిన్ చెప్పారు. షిబు, రస్ అల్ ఖైమాలోని అల్ జజీరా పోర్ట్ ఉద్యోగి. సిజ్జి, ఆమె ఇద్దరు కుమారులు కేరళలో నివసిస్తున్నారు. సిబు, తన కుటుంబాన్ని కలిసేందుకు కేరళ వెళ్ళి ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







