నడుం నొప్పితో భామ పడుతున్న కష్టాలు
- March 17, 2018
స్టార్ హీరోయిన్.. నడుం నొప్పి అనగానే వెంటనే మీకు అనుష్క శెట్టి గుర్తొచ్చేసిందా? `సింగం3` షూటింగ్ సమయంలో నడుం పట్టేసిందని, దానివల్ల బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందని, అందుకే అనుకున్నంత మేర బరువు తగ్గలేకపోతున్నాననీ ఆ మధ్య అనుష్క చెప్పింది కదా. అందుకే వెంటనే నడుం నొప్పికి, అనుష్క పేరుకు లింకు పెట్టేసుకుని ఉంటారు. అనుష్క కి ప్రస్తుతం కాస్త ఉపశమనం కలిగినట్టేనండీ. కాకపోతే ఇక్కడ మనం చెబుతున్న హీరోయిన్ కూడా కన్నడ హుడుగినే. ఈ భామ ఉత్తరాదిన హల్చల్ చేస్తోంది అనుకోండి. ఆమె పేరు దీపికా పడుకొనె.
ఈ మధ్య `పద్మావత్` చిత్రంతో చాలా ఫేమస్ అయిన ఈ భామని ప్రస్తుతం నడుం నొప్పి పట్టి పీడిస్తోందట. ఈ విషయాన్ని దీపిక సన్నిహితులు చెబుతున్నారు. `పద్మావత్` సమయంలోనే దీపికకి నడుం నొప్పి విపరీతంగా ఉండేదట. దానికి తోడు డీ3 లోపం కూడా ఉందట. దాంతో తప్పనిసరిగా రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఒక వైపు ఫిజియోథెరపీ కూడా చేయించుకుంటోంది ఈ సుందరి. త్వరలో నయం అయితే విశాల్ భరద్వాజ్ సినిమా మొదలుకానుంది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







