జన్మభూమిని సందర్శించిన కువైట్ లో భారత రాయబారి కె.జీవ సాగర్

- March 17, 2018 , by Maagulf

మచిలీపట్నం: బందరు ఆణిముత్యం...నోబుల్ కాలనీకు గర్వ కారణం ..నోబుల్ కాలేజీ పూర్వ విద్యార్థి ...1991 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ర్యాంకర్ ..ఎన్నో దేశాలలో భారత్ తరుపున అంబాసిడర్ గా పనిచేసి ప్రస్తుతం కువైట్ దేశంలో భారతదేశం తరుపున రాయబారి కాకరవాడ జీవసాగర్ శనివారం తన జన్మస్థలమైన  బందరు వచ్చారు. నోబుల్ కాలేజీ 175 సంవత్సరాల వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన నోబుల్ కాలనీ వాసులను పేరు పేరునా పలకరించారు. ఈ ఫోటోలో ఎడమ నుంచి కుడివైపునకు హెరాల్డ్ నిర్మల్ కుమార్, (మేనేజర్) ఎన్. జాన్సన్ జాకబ్, ( జర్నలిస్ట్ ) లాల్ (రిటైర్ ఎస్పీ ప్రేమ్ కుమార్  తమ్ముడు), కె. ఐజాక్ సుగుణాకర్ (నోబెల్ ప్యారీష్ చర్చి సెక్రటరీ), అజిత్ దివాకర్ (రియల్ ఎస్టేట్ కంపెనీ .ఎం.డి).  అనంతరం  " బందరు బంధువుల " ఫేస్బుక్ , నోబుల్ కాలేజ్ మచిలీపట్నం అల్యూమిన్  గ్రూప్ గురించి వివరాలు అడిగి తెలుసుకొన్నారు..ఈసారి వచ్చినపుడు అందరిని కలుస్తానని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com