'బ్రహ్మోస్' క్షిపణి పరీక్ష విజయవంతం
- March 22, 2018పోఖ్రాన్: రాజస్థాన్‌లోని పోఖ్రాన్ క్షిపణి కేంద్రం నుంచి బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూయిజ్ క్షిపణిని గురువారం విజయవంతంగా పరీక్షించారు. సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి చివరిసారిగా 2017 నవంబర్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానం సుఖోయి -30 ఎంకేఐ నుంచి పరీక్షించారు. గత సంవత్సరం దుబాయ్ ఎయిర్ షోలో కూడా బ్రహ్మోస్ ప్రదర్శన జరిగింది. పలు దేశాల సైనికాధికారులు కూడా వీటిని కొనేందుకు చాలా ఆసక్తి చూయించారు.
బ్రహ్మోస్ గురించి కొన్ని వాస్తవాలు
- బ్రహ్మోస్ ఒక మాధ్యమ శ్రేణి రామ్జెట్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి.
- భూమి, గాలి మరియు సముద్రం నుండి దీనిని ప్రయోగించవచ్చు.
- ఇది భారతదేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ), రష్యన్ ఫెడరేషన్ ఎన్‌పీఓ మాషినోస్రోయేనియాల ఉమ్మడి వెంచర్.
- బ్రహ్మోస్ అనే పదం భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది(Brahmaputra) మొదటి నాలుగు అక్షరాలు, రష్యాలోని మాస్కోవా నది(Moskva) పేరులోని మొదటి మూడు అక్షరాలన నుంచి వచ్చింది.
- గతంలో బ్రహ్మోస్ 2.8 నుంచి 3.0 మాక్‌ల వేగంతో ప్రయాణించేది. ఇప్పుడు దీని వేగం 5.0 మాక్‌లకు అప్‌గ్రేడ్ చేశారు. (మాక్ = 1234.8 కిలోమీటర్/అవర్)ఇది మాక్
- ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణి.
- ఇది 2006 నుంచి సేవలందింస్తోంది.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?