ప్రవాస కేరళీయుల ఆప్తుడు - డాక్టర్ అహ్మద్‌కు కురియన్ ప్రశంస
- March 25, 2018
తిరువనంతపురం: ప్రవాస కేరళీయులకు, గల్ప్ నుంచి తిరిగి వచ్చిన వారికీ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఎస్ అహ్మద్ కీలక పాత్ర వహించారని రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ పిజె కురియన్ కొనియాడారు. సామాజిక సేవకు ఇటీవల అహ్మద్‌ను గౌరవ డాక్టరేట్ లభించిన సందర్భంగా జరిగిన సత్కార సభలో కురియన్ ప్రసంగించారు. కుటుంబ నియంత్రణ పథకాల అమలు సహా పలు రంగాల్లో అన్ని తరగతుల ప్రజల సంక్షేమానికీ కృషి చేశారని కురియన్ పేర్కొన్నారు. ప్రవాస భారతీయులకు సంబంధించి దేశంలోనే తొలిసారిగా ఆల్ కేరళ రిటర్నీస్ ఆర్గనైజేషన్‌ను 1988లో అహ్మద్ స్థాపించారు. ప్రస్తుతం దేశ విదేశాల్లోని 36 ఎన్నారై సంస్థల సంఘానికి ఆయన సమన్వయ మండలి చైర్మన్‌గా ఉన్నారు. బతుకు తెరువు కోసం దేశంలోని తమ స్వస్థలాలను విడిచి వెళ్లిన వారి సమస్యలను పరిష్కరించడానికి అంకితం కావాలని నిర్ణయించుకున్నట్లు డాక్టర అహ్మద్ తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







