ఫేస్‌బుక్‌ డేటా బ్రీచ్‌పై ఆపిల్‌ సీఈవో

- March 25, 2018 , by Maagulf
ఫేస్‌బుక్‌ డేటా బ్రీచ్‌పై ఆపిల్‌ సీఈవో

ఫేస్‌బుక్‌ డేటా బ్రీచ్‌పై టెక్‌ దిగ్గజం ఆపిల్‌ సీఈవో  టిమ్‌ కుక్‌ ఆందోళన వ్యక్తం చేశారు. చైనా డెవలప్మెంట్ ఫోరంలో అమెరికా, చైనా ట్రేడ్‌వార్‌ ఆందోళనలపై ప్రసగించిన  ఆయన   ఫేస్‌బుక​ యూజర్ డేటా ఉల్లంఘన కుంభకోణంపై స్పందించారు.  పరిస్థితి చాలా ఘోరంగా ఉంది.. ఈ ఉదంతం యూజర‍్ల డేటాభద్రతపై రెగ్యులేటరీ తీసుకోవాల్సిన  కఠిన నిబంధనలను మరోసారి గుర్తు చేసిందన్నారు. అదీ ఫేస్‌బుక్‌ లాంటి సంస్థ ఇలాంటి వివాదాల్లో ముందువరసలో ఉండటం మరింత విచారకరమని ఆయన  వ్యాఖ్యానించారు. 

ఫేస్‌బుక్‌లో 5కోట్ల ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు లీక్‌పై ప్రశ్నించినపుడు కస్టమర్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతం కావడం చాలా భయంకరమైందనీ కుక్‌  వ్యాఖ్యానించారు. ఈ వివాదం యూజర్ డేటా  రక్షణపై రూపొందించాల్సిన కఠిన నిబంధనల అవసరాన్ని నొక్కి చెప్పిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆపిల్ వినియోగ దారుల గోప్యతకు సంబంధించి తాము ఆందోళన చెందుతున్నామన్నారు. గతకొన్ని సంవత్సరాలుగా చాలాదేశాల్లో  డేటా ఉల్లంఘన సంఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన రేపుతోందన్నారు.  వినియోగదారుల  గోప్యతపై  ఈ అంచనాలు మరోసారి  నిజం కావడం దురదృష్టకరమన్నారు.  యూజర్లు అనేక సంవత్సరాలుగా ఏమి బ్రౌజ్ చేస్తున్నారు. వారి స్నేహితుల జాబితా, మళ్లీ ఆ  స్నేహితుల లిస్ట్‌లోని వారి పరిచయాలు,  లైక్స్‌, డిస్‌లైక్స్‌ ..ఇలా  వ్యక్తుల జీవితాల్లోని అత్యంత కీలకమైన అంశాలు   వేరే వ్యక్తుల చేతుల్లోకి పోకూడదన్నారు. వ్యక్తిగత వివరాలు  బహిర్గతం కూకాడదని కుక్‌ అభిప్రాయపడ్డారు.

కాగా యూజర్ల సమాచారం విక్రయానికి గురైందన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే టాప్‌సంస్థలు  తీవ్రంగా స్పందించడం ఫేస్‌బుక్‌కు ప్రతికూల అంశం. ముఖ్యంగా వాట్సాప్‌ సహ వ్యవస్థాపకుడు బ్రియాన్‌ ఆక్టన్‌ డిలీట్‌ ఫేస్‌బుక్‌ ఉద్యమం,   ఫేస్‌బుక్‌ పేజీలను డిలిట్‌ చేస్తున్నట్టు స్సేస్‌ ఎక్స్‌  అధిపతి ఎలన్‌ మస్క్‌ ప్రకటించడం మరింత ఆందోలన రేపింది. తాజాగా  ఆపిల్‌ సీఈవో వ్యాఖ్యలు, వెలుబుచ్చిన ఆందోళన ఫేస్‌బుక్‌పై ఒత్తిడిని తీవ్రం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com