మార్క్ జుకెర్ బర్గ్ ఆస్తిలోని 99 శాతాన్ని సేవా కార్యక్రమాలకే!
- December 02, 2015
ఫేస్ బుక్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకెర్ బర్గ్ వారం క్రితం జన్మించిన తమ కూతురుకు మ్యాక్స్‌గా నామకరణం చేసుకున్నారు. అంతేగాకుండా మ్యాక్స్‌పై సంచలన ప్రమాణం చేశారు. తమ ఆస్తిలోని 99 శాతాన్ని సేవా కార్యక్రమాలకే వినియోగిస్తామని బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని సక్రమ రీతిలో ఖర్చు చేసేందుకు 'చాన్ జుకెర్ బర్గ్' పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఈ యువ దంపతులు ప్రకటించారు. పుట్టబోయే కూతురు కోసం జుకెర్ బర్గ్ ఏకంగా రెండు నెలల పితృత్వ సెలవు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా సోషల్ మీడియాలో ఫేస్ బుక్ ది తొలి విజయమన్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లను ఒకే వేదికపైకి చేర్చిన ఫేస్ బుక్‌తో దాని సహ వ్యవస్థాపకుడు, సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకెర్ బర్గ్ అత్యంత పిన్న వయసులోనే బిలియనీర్‌గా అవతరించాడు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







