ఖతార్‌లో హెచ్‌ఐవి కేసుల తగ్గుదల
- December 02, 2015
ప్రపంచంలోనే హెచ్‌ఐవి ఇన్ఫెక్షన్ రేట్ విషయంలో ఖతార్‌లో చాలా తగ్గుదల నమోదయ్యిందని అధికార వర్గాలు వెల్లడించాయి. సుప్రీం కౌన్సిల్ ఆఫ్ హెల్త్, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం రోజున ఈ విషయాన్ని వెల్లడించింది. సుప్రీం కౌన్సిల్, హమాద్ మెడికల్ కార్పొరేషన్, ప్రైమరీ హెల్త్ కార్పొరేషన్, ఇతర భాగస్వాములతో కలిసి అవేర్‌నెస్ క్యాంపెయిన్‌ని నిర్వహించారు. హెచ్‌ఐవి వ్యాప్తిని అరికట్టడంలో ఖతార్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ఈ సందర్భంగా చెప్పారు. 2015 ఎయిడ్స్ డే సందర్భంగా 'హెచ్‌ఐవి ట్రీట్‌మెంట్ ఫర్ ఆల్' అనే ఇనీషియేట్‌ని తీసుకున్నారు. 2000 సంవత్సరంతో పోల్చితే ఎయిడ్స్ వ్యాప్తి 35 శాతం తగ్గిందనీ, అలాగే ఎయిడ్స్ సంబంధిత మరణాలు 24 శాతం తగ్గాయని కూడా అధికారులు వెల్లడించడం జరిగింది.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







