అమృత్సర్ చేరుకున్న ఆ మృతదేహాలు
- April 02, 2018
అమృత్సర్: ఇరాక్‌లోని మోసుల్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చేతుల్లో హతమైన 39 మంది భారతీయుల మృతదేహాలు ఇవాళ భారత్‌కు చేరుకున్నాయి. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కాసేపటి క్రితం మృతదేహాలతో వచ్చిన విమానం ల్యాండైంది. అయితే మోసుల్‌లో మృతిచెందిన వారి బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలా వద్దా అన్న అంశాన్ని కేంద్రం చర్చిస్తోందని మంత్రి వీకే సింగ్ తెలిపారు. ఆ మృతులకు ఎటువంటి నష్టపరిహారం చెల్లిస్తారన్న అంశాన్ని కూడా తేల్చనున్నట్లు మంత్రి చెప్పారు. ఇరాక్‌లోని మొసుల్‌లో సుమారు 40 మంది భారతీయులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జూన్ 11, 2014లో కిడ్నాప్ చేసింది. అందులో ఒకరు తప్పించుకున్నారు. మిగతా 39 మందిని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చంపేసినట్లు ఇటీవల లోక్‌సభలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు ఒకరికి 5 లక్షలు ఇవ్వనున్నట్లు పంజాబా్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ తెలిపారు. ఒక వ్యక్తికి ఉద్యోగంతో పాటు ఆ ఫ్యామిలీకి 20 వేల పెన్షన్ ఇవ్వనున్నట్లు సిద్ధూ చెప్పారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







