నితిన్ పై దొంగతనం నింద...ఇదేమి వింత!
- April 02, 2018
తెలుగు ఇండస్ట్రీలో 'జయం' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్ జయాపజయాలతో నిమిత్తం లేకుండా హీరోగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో మేఘా ఆకాష్ హీరోయిన్ నటిస్తున్న 'ఛల్ మోహన్ రంగ ' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం 5న రిలీజ్ కాబోతుంది. ఛల్ మోహన్ రంగ చిత్రానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మూల కథని అందించారు.
లై చిత్రంలో నితిన్, మేఘా మధ్య కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి.వైజాగ్ లో ప్రమోషన్ కార్యక్రమాలని ముగించుకున్నా తర్వాత నితిన్ లక్ష్మి నరసింహస్వామి ఆశీస్సుల కోసం సింహాచలం ఆలయానికి వెళ్లారు. స్వామివారి ఆశీస్సుల కోసం నితిన్ ఆలయానికి వెళితే వింత అనుభవం ఎదురైంది. ఆలయంలో స్వామివారి ఉంగరం పోయిందని, ఆ సమయంలో నితిన్ అక్కడ ఉండడంతో అతడిపై నింద వేశారు. దీంతో నితిన్ తో సహా చిత్ర యూనిట్ బిత్తరపోయారు..ఇదేంటీ నితిన్ స్వామి వారి ఉంగరం తీయడం ఏంటీ ఆని ఒక్కసారే షాక్ కి గురయ్యారు.
తాను తీయలేదని కావాలంటే చెక్ చేసుకోండి అంటూ నితిన్ కోరాడు. తాను ఉంగరం తీయలేదని నితిన్ చెబుతున్నా అర్చకులు బంధించారు. హీరోగా మంచి పేరు సంపాదించిన మీరు స్వామివారి ఉంగరం దొంగిలించడం ఏంటి.. మర్యాదగా ఆ ఉంగరాన్ని ఇచ్చేయండి అంటూ అంటూ అర్చకులు నితిన్ ని నిలదీశారు. నేను తీయలేదు మొర్రో అంటున్నావినిపించుకోలేదు. అంతే కాదు అక్కడ ఉన్న మరికొంత మంది అనుమానితులను పూజారులు బందించారు. నితిన్ తో సహా బందీలుగా ఉన్న వారంతా ఏం జరుగుతుందో అర్థం కాక కంగారు పడుతూ కనిపించారు.
కాకపోతే ఈ తతంగం అంతా అక్కడ ఉన్న భక్తులు చూస్తు నవ్వడం మొదలు పెట్టారు..ఇది చూసి చిత్ర యూనిట్ మరింత నిరుత్సాహ పడ్డారు. ఆలయ అర్చకులు ఎట్టకేలకు ఉంగరం దొరికిందని ప్రకటించడంతో బందీలుగా ఉన్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు అసలు విషయం చెప్పిన తర్వాత నితిన్ తో సహా చిత్ర యూనిట్ పగలబడి నవ్వుకున్నారు.
ప్రతి ఏడాది స్వామివారికి సింహాద్రి అప్పన్న కల్యాణ ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు వినోద ఉత్సవం నిర్వహిస్తారు. అందులో భాగంగానే స్వామివారి ఉంగరం పోయిందంటూ కొంత మంది భక్తులని ఆటపట్టిస్తారు. ప్రతి ఏడాది జరిగే ఈ తంతులో ఈ సారి నితిన్ బుక్ అయ్యాడన్నమాట.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..