మస్కట్‌లో సోలార్ పవర్డ్ ఏసీ బస్ స్టాప్
- April 02, 2018
మస్కట్: మవసలాత్, అల్ మహా పెట్రోలియం ఓ ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. 125,000 ఒమన్ రియాల్స్ ఖర్చుతో సోలార్ ఎనర్జీ పవర్డ్ ఎయిర్ కండిషనల్ బస్ స్టాప్ ఏర్పాటు చేసేందుకోసమే ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మవసలాత్, అల్ మహా పెట్రోలియం ప్రోడక్ట్స్ మార్కెటింగ్ కంపెనీతో ఈ ఒప్పందం చేసుకుంది. బస్‌స్టాప్‌కి సంబంధించి ఎక్స్‌క్లూజివ్‌గా ప్రమోట్ మరియు అడ్వర్టైజ్మెంట్స్ హక్కుల్ని ఈ సంస్థ పొందింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పట్ల ప్రయాణీకుల్లో ఇంట్రెస్ట్ పెంచే దిశగా ఇలాంటి ఒప్పందాలు, నిర్మాణాలు ఉపయోగపడ్తాయని మవసలాత్ పేర్కొంది. ఒమన్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ (ఒమన్‌టెల్)తో 2016 డిసెంబర్లో మవసలాత్ టూ స్టాప్ అగ్రిమెంట్‌ని ఎదుర్చుకుంది. మరో అగ్రిమెంట్ లులు హైపర్ మార్కెట్‌తో కుదుర్చుకుంది. ఒమన్ అవెన్యూ మాల్ వద్ద ఎయిర్ కండిసన్డ్ బస్‌స్టాప్ ఏర్పాటు చేసేందుకు 2017 జూన్‌లో ఈ ఒప్పందం కుదిరింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







