పాకిస్తాన్ లో పది మంది ఉగ్రవాదులకు మరణశిక్ష

- April 02, 2018 , by Maagulf
పాకిస్తాన్ లో పది మంది ఉగ్రవాదులకు మరణశిక్ష

పది మంది ఉగ్రవాదులకు మరణశిక్షను అమలు పాకిస్తాన్ చేయబోతోంది. 10 మంది ఉగ్రవాదులు సుమారు 62 మందిని చంపినట్లు ఆర్మీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. పెషావర్‌లోని ఫైవ్‌స్టార్ హోటల్‌పై దాడి చేసిన వారిని కూడా ఉరితీయాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు. సింగర్ సాబ్రిని హత్య చేసిన లిస్టులో ఇషాక్, ఆసిమ్‌లు ఉన్నారు. 2016, జూన్ 22న సూఫీ సింగర్ హత్య జరిగింది. సూఫీ సింగర్ అంజద్ సాబ్రిని హత్య చేసిన ఉగ్రవాది కూడా ఆ జాబితాలో ఉన్నాడు. పాక్ మిలిటరీ కోర్టు ఇచ్చిన తీర్పుకు ఆర్మీ జనరల్ ఆమోదం తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com