ఇసుకలో కూరుకుపోయి ఇద్దరు కార్మికుల మృతి
- April 02, 2018
ఆసియాకి చెందిన ఇద్దరు కూలీలు, ఓ బావిని తవ్వుతున్న క్రమంలో ఇసుకలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. రస్ అల్ ఖైమాలోని రెసిడెన్షియల్ జోన్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇసుకలో కూరుకుపోయిన ఇద్దరి మృతదేహాల్ని రస్ అల్ ఖైమా పోలీస్ మరియు సివిల్ డిఫెన్స్ శ్రమించి బయటకు తీయడం జరిగింది. ఉదయం 10.30 నిమిషాల సమయంలో ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే, సంఘటనా స్థలానికి రెస్క్యూ మరియు సెర్చ్ టీమ్స్ బయల్దేరాయనీ, 20 మీటర్ల లోతున కూరుకుపోయిన మృతదేహాల్ని బయటకు తీశామని అల్ మమౌరా పోలీస్ స్టేషన్ యాక్టింగ్ డైరెక్టర్ కెప్టెన& మొహమ్మద్ అలి అల్ నౌమి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుగుతోంది. ఇలాంటి పనులు చేపట్టేముందు తగిన అనుమతులు పొందాలని రస్ అల్ ఖైమా పోలీస్ సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ ఘానెమ్ అహ్మద్ ఘానెమ్ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







