వాట్సాప్‌లో ఫేక్ మెసేజ్: 1 మిలియన్ దిర్హామ్ వరకు జరీమానా
- April 02, 2018
వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఫేక్ మెసేజ్‌లను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని అబుదాబీ పోలీస్ హెచ్చరించడం జరిగింది. సమాచారాన్ని దొంగిలించడం, దొంగిలించిన సమాచారాన్ని బహిర్గతం చేయడం, వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాల్ని 'అనుమతి లేకుండా' బహిర్గతం చేయడం వంటివి తీవ్రమైన నేరాలుగా పరిగణింపబడ్తాయనీ, ఇవన్నీ ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయిన దరిమిలా, కఠినమైన చట్టాలు అలాంటి క్రిమినల్ చర్యలకు అడ్డుకట్ట వేస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. ఫేక్ జాబ్స్, ఫేక్ హెల్త్ టిప్స్ వంటివి ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నాయని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి నేరాలకు సైబర్ క్రైమ్ లా ప్రకారం కఠిన చర్యలుంటాయని చెబుతూ, ఇలాంటి నేరాలకు పాల్పడితే ఏడాది నుంచి మూడేళ్ళ జైలు శిక్షతోపాటుగా 250,000 నుంచి 1 మిలియన్ దిర్హామ్ వరకు జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. నాన్ ఎలక్ట్రానిక్ ఫ్రాడ్ అయితే ఒకటి నుంచి మూడు నెలల వరకు జైలు శిక్ష, 1000 నుంచి 30,000 దిర్హామ్‌ల జరీమానా తప్పదు.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







