'బాహుబలి-2' షూటింగ్ కోసం సిద్ధo
- December 02, 2015
దర్శకుడు రాజమౌళి సృష్టించిన వెండితెర చారిత్రక కావ్యం 'బాహుబలి' దేశవ్యాప్తంగా బాక్సాఫీసులను బద్దలుకొట్టి ఎన్నో రికార్డులు సృష్టించింది. మరెన్నో రికార్డులను బ్రేక్ చేసింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొంది.. భారతీయ భాషల్లోకి అనువాదమైన ఈ సినిమా బుల్లితెర టీఆర్పీ రేటింగ్స్‌లోనూ సత్తా చాటింది. ఇప్పుడు ఈ సినిమా యూట్యూబ్‌లోనూ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నది. అంతేకాకుండా 4కే రిజుల్యూషన్‌తో యూట్యూబ్‌లో విడుదల అవుతున్న తొలి భారతీయ సినిమాగా 'బాహుబలి' చరిత్ర సృష్టించనుంది. త్వరలోనే తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో యూట్యూబ్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఇదిఇలా ఉండగా ప్రభాస్, రాణా, అనుష్క 'బాహుబలి-2' షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి 'బాహుబలి- ది కన్‌క్లూజన్' సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రభాస్‌తోపాటు ఈ సినిమాలో నటించిన తారలంతా షూటింగ్‌కు అవసరమైన సన్నాహాకాల్లో మునిగిపోయారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







