ఇరాక్ మృతులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా
- April 03, 2018
న్యూఢిల్లీ: ఇరాక్‌లో ఐఎస్ ఉగ్రమూకల చేతుల్లో ఊచకోతకు గురైన భారతీయుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. రూ.10 లక్షల చొప్పున మొత్తం 39 మంది మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రకటించారు. ఇరాక్‌లో మృతి చెందిన భారత కార్మికులకు పరిహారం చెల్లించాలంటూ పంజాబ్‌కి చెందిన కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో నిరసన తెలిపిన అనంతరం ప్రధాని ఈ ప్రకటన చేశారు.
ఇరాక్‌లోని మోసుల్ సమీపంలో ఐఎస్ ఉగ్రవాదుల చేతిలో బలైన మొత్తం 39 మందిలో... 38 మంది మృతుల అవశేషాలను నిన్న భారత్ తరలించిన సంగతి తెలిసిందే. కేంద్ర విదేశాంగ సహాయమంత్రి వీకే సింగ్ ప్రత్యేక విమానంలో ఇరాక్ వెళ్లి మృతదేహాలను తీసుకొచ్చారు. మృతుల్లో అత్యధికంగా 27 మంది పంజాబ్‌కు చెందినవారే కావడంతో... వీకే స్వయంగా అమృత్సర్ వెళ్లి మృతదేహాలను అప్పగించారు. కాగా 2014లో ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన 39 మంది భారతీయులు మరణించినట్టు గత నెలలో కేంద్ర విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







