అమ్నెస్టీ రిపోర్ట్‌ని తిరస్కరించిన ఖతార్
- December 02, 2015
ఖతార్ ప్రభుత్వం అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇచ్చిన నివేదికను తిరస్కరించింది. ఖతార్‌లో వలస కార్మికులు నిరాదరణకు గురవుతున్నారనీ, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన నివేదికలో పేర్కొనడాన్ని ఖతార్ ప్రభుత్వం తప్పు పట్టింది. ఖతార్‌లో వలస కార్మికుల కోసం అనేక చర్యలు చేపడుతున్నామనీ, దేశ అభివృద్ధిలో వలస కార్మికుల పాత్ర ఎనలేనిదని ఖతార్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వలస కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో నిత్యం తనిఖీలు జరుగుతుంటాయన్న ప్రభుత్వం, ఎక్కడా ఎలాంటి నిర్లక్ష్యాన్నీ ఉపేక్షించడంలేదనీ, సమస్యల పట్ల తీవ్రంగా స్పందిస్తున్నామని పేర్కొంది. కార్మికుల్ని ప్రొటెక్ట్ చేసేందుకు ఖతార్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ, జాతి నిర్మాణంలో కార్మికులు కీలక భూమిక పోషిస్తున్నారని స్పష్టంగా చెప్పింది. దేశ కీర్తి ప్రతిష్టలు దెబ్బతినేలా ఆమ్నెస్టీ రిపోర్ట్ ఉందని ఆక్షేపణ వ్యక్తం చేస్తూ, వేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ద్వారా కార్మికులు తగిన సమయంలో జీతాలు పొందుతున్నారని, అలాగే వారంతా సంతోషంగా తమ పనులు చేసుకుంటున్నారని చెప్పింది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







