కడుపులో డ్రగ్స్: ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్
- April 07, 2018
దుబాయ్:ఇద్దరు అన్నదమ్ముల్ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేశారు. వీరి కడుపులో 1,300 గ్రాముల హెరాయిన్‌ని గుర్తించి, వెలికి తీశారు. పోలీసులు, ఇద్దరు ఆసియా జాతీయులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుని, యాంటీ నార్కటిక్స్ డిపార్ట్మెంట్ సహాయంతో ఆపరేషన్ నిర్వహించి, స్మగ్లర్స్‌ని పట్టుకున్నట్లు యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ ఈద్ మొహమ్మద్ థని హరిబ్ చెప్పారు. విజిటర్స్‌కి కల్పించిన అవకాశాల్ని తెలుసుకున్న స్మగ్లర్లు తెలివిగా ప్లాన్ చేయడంతో, విషయాన్ని ముందే పసిగట్టిన అధికారులు, సంబంధిత శాఖల్ని అలర్ట్ చేశారు. బోర్డర్స్ వద్ద కూడా వీరిపై గట్టి నిఘా వుంచారు. అరెస్టు చేసిన నిందితుల్ని విచారించిన పోలీసులు, వారి కడుపులో హెరాయిన్ క్యాప్సూల్స్ వుంచిన విషయాన్ని తెలుసుకున్నారు. రషీద్ ఆసుపత్రికి తరలించి, వారినుంచి క్యాప్సూల్స్‌ని బయటకు తీశారు. మొదటి నిందితుడు 790 గ్రాముల బరువైన మొత్తం 61 క్యాప్సూల్స్‌ని కడుపులో దాచుకోగా, మరో వ్యక్తి 538 గ్రాముల బరువైన 47 క్యాప్సూల్సని దాచాడు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







