విమానాశ్రయంలో కిలో బంగారం స్వాధీనం..

- December 03, 2015 , by Maagulf
విమానాశ్రయంలో కిలో బంగారం స్వాధీనం..

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ ప్రయాణికుడి నుంచి కిలో బంగారం, కిలో వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం దుబాయి నుంచి వచ్చిన ప్రయాణీకుల లగేజీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ లగేజీలో అధిక మొత్తంలో బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బంగారం, వెండికి సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com