దుబాయ్ లో GIPT-GULF ALUMNI MEET-2015
- December 03, 2015
హైదరాబాదు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రింటింగ్ టెక్నాలజీ పూర్వ విద్యార్ధుల సమావేశం 02. 12. 2015 న సాయంత్రం డేరా దుబాయ్ అబూ హెయిల్ లోటస్ గ్రాండ్ హోటల్ లో ఘనంగా జరిగింది. 1978 నుండి ఇప్పటిదాకా ఆ కళాశాలలో చదువుకున్న విద్యార్ధులలో దాదాపు 75 మంది కి పైగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో వివిధ ప్రింటింగ్ సంస్థలో పలు హోదాల్లో పని చేస్తున్నారు. అంతే కాకుండా ఇతర గల్ఫ్ దేశాల్లో కలిపి దాదాపు 120 మందికి పైగా గల్ఫ్ రీజియన్ లో ఉన్నారు. వారందరినీ ఒకే వేదిక పైకి తేవాలనే ఉద్దేశంతో దాదాపు 2 నెలలు శ్రమించి GIPT-GULF ALUMNI MEET-2015 సమావేశాన్ని రూపొందించారు. ఇందులో భాగంగానే ఇటీవల పదవీ విరమణ చేసిన తమ కళాశాల అధ్యాపకుల్ని ఆహ్వానించి వారిని సన్మానించారు. ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా శ్రీ మురళి , హరిప్రసాద్ వ్యవహరించగా సమన్వయకర్తలుగా రాజేష్ వేమూరి , కండే వెంకటేశ్వర్లు, తిరుపాల్ వ్యవహరించారు.గల్ఫ్ రీజియన్లో ప్రింటింగ్ టెక్నాలజీ కి అపారమైన ఉద్యోగావకాశాలు ఉన్నాయని ఇకపై గల్ఫ్ రీజియన్లో ఆ కళాశాలలో చదువుకున్న విద్యార్ధులకి మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించటానికి పూర్వ విద్యార్ధులంతా కృషి చేయాలని సమావేశంలో పాల్గొన్న వక్తలు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







