వెయిట్ లిఫ్టర్ల హవా..భారత్ ఖాతాలో మరో స్వర్ణం
- April 08, 2018
భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న 21వ ఎడిషన్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ల హవా కొనసాగుతుంది. తాజాగా 69 కేజీల విభాగంలో పూనమ్ యాదవ్ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఆదివారం ఉదయమే జరిగిన పోటీల్లో పూనమ్ 222 కేజీల బరువును ఎత్తి పసిడి పతకం సాధించింది. ఈ తాజా పథకంతో భారత పతకాల సంఖ్య ఏడుకు చేరుకుంది. ఐదు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పథకాలు భారత్ ఖాతాలో ఉన్నాయి. అయితే పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా పసిడి పతకం సాధించిన పూనమ్ యాదవ్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతితో సహా పలువురు ప్రముఖులు పూనమ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంతకుముందు 2014 గ్లాస్గోవ్ కామెన్‌వెల్త్ క్రీడల్లో పూనమ్ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







